దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. టాలీవుడ్ స్టార్స్ వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు సమాచారం. ఇటీవలే చరణ్ వ్యానిటీ డ్రైవర్ జయరాంకు కరోనా సోకగా… ఈరోజు ఆయన కరోనాతో మృతి చెందాడు. చరణ్ సిబ్బందిలో ఒకరు కరోనాతో ఆకస్మికంగా చనిపోవడం విషాదకరం. ప్రస్తుతం చరణ్ కూడా ముందుజాగ్రత్తగా ఐసోలేషన్ లోకి వెళ్లారట. త్వరలోనే చరణ్ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోనున్నారు.…