Tummala Nageswara Rao : జోగులంబ గద్వాల జిల్లా పత్తి రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పత్తి విత్తనాలను సరఫరా చేసిన రైతులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించేందుకు సీడ్స్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గద్వాల జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు జరుగుతోందని, రైతులు విత్తన ఉత్పత్తి చేసి కంపెనీలకు అందించినప్పటికీ వారికి ఇప్పటి వరకు చెల్లింపులు జరగలేదని…