ఆసియా కప్ 2025లో భాగంగా అబుదాబి స్టేడియంలో హాంగ్ కాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ సెదిఖుల్లా అటల్ (73; 52 బంతుల్లో 6×4, 3×6) హాఫ్ సెంచరీ చేశాడు. ఇన్నింగ్స్ చివరలో అజ్మతుల్లా ఒమర్జాయ్ వీరవిహారం చేశాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 53 రన్స్ బాదాడు. మహమ్మద్ నబీ (33) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.…