నటి ప్రియమణి 2017లో ముస్తఫారాజ్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడడం తెలిసిందే. అయితే, కొద్దిరోజులుగా ముస్తఫారాజ్ మొదటి భార్య ఆయేషా వారి పెళ్లిపై ఆరోపణలు చేస్తోంది. తాము ఇంకా విడాకులు తీసుకోలేదని, ప్రియమణితో తన భర్త రెండో పెళ్లి చెల్లదని చెబుతోంది. ముస్తఫా, తాను ఇప్పటికీ భార్యాభర్తలమేనని, ప్రియమణితో అతడి పెళ్లి నాటికి తాము విడాకులకు కూడా దరఖాస్తు చేయలేదని స్పష్టం చేసింది. కాగా, ముస్తఫారాజ్, ఆయేషా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే విభేదాల నేపథ్యంలో 2010…