ఫైనాన్షియల్ టైమ్స్ మాస్టర్స్ ఇన్ మేనేజ్‌మెంట్ (FT MiM) 2024 గ్లోబల్ ర్యాంకింగ్స్ ఆదివారం విడుదల అయ్యాయి. అంతర్జాయతీ ర్యాంకింగ్స్‌లో భారతీయ వ్యాపార పాఠశాలలు బలమైన ఉనికిని చాటుకున్నాయి. భారతీయ విద్యాభవన్‌కు చెందిన ఎస్‌పీ జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ (SPJIMR) ప్రపంచవ్యాప్తంగా 35వ ర్యాంకు సాధించి అగ్రస్థానంలో చోటు సంపాదించుకుంది.