అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతూనే వున్నాయి. భారత్ బంద్ తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. విశాఖపట్నం పరిధిలోని రైల్వే స్టేషన్ ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేసింది. సాయుధ బలగాల పహారా కొనసాగుతోంది. అనుమనితులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తున్నారు. రైళ్ల రాకపోకలు యధాతథంగా జరుగుతున్నాయి. అగ్నిపథ్ అల్లర్ల నేపథ్యంలో వాల్తేర్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. బైక్, కారు పార్కింగ్ అనుమతి నిరాకరించారు. అటు, పార్సిల్…