సీఎం జగన్ ఏపీలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణంగా ఆయన రాష్ట్రమంతా చేసిన పాదయాత్రనే. జనంలో ఉన్నాడు కాబట్టే గెలిచాడంటారు. అందుకే 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలి జోరుగా వీయడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దాదాపు రెండున్నరేళ్లుగా వైసీపీ సర్కారు పాలన కొనసాగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. నాడు ఇచ్చిన హామీలతోపాటు ఎన్నికలను మేనిపెస్టోనూ తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. దీంతో ఆయన పాలనపై ప్రజల్లో నమ్మకం…