దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ఎంతో మంది సినీ తారలు, క్రీడా ప్రముఖులు కరోనా టీకా తీసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని బిగ్‌బీ ఇన్‌స్టా ద్వారా తెలిపారు. ‘రెండో డోస్ కూడా తీసుకున్నాను’ అని రాసుకొచ్చారు. ఇక ఆ మధ్య అమితాబ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఇక అమితాబ్ బచ్చన్…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. ఆయన టీకా సెంటర్ కు వెళ్లిన పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మే 14 శుక్రవారం ముంబైలోని ఒక టీకా కేంద్రంలో సల్మాన్ ఖాన్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. అంతకుముందు సల్మాన్ ఖాన్ మార్చి 24న ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. భారతదేశంలో ప్రస్తుతం కోవిడ్ -19 కేసుల సంఖ్యా భారీగా పెరిగిపోతోంది. ఇక సెలబ్రిటీలు కూడా సురక్షితంగా…