Ujjaini Bonalu: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజ అనంతరం తెల్లవారుజామున 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు.
Bonalu: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బోనాల పండుగను నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బోనాల పండుగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పండుగను ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. ఈ మాసంలో ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.