Chile Former President Sebastian Pinera Dead: చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా (74) హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. మంగళవారం మధ్యాహ్నం లాస్ రియోస్ ప్రాంతంలోని లాగో రాంకో కమ్యూన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పినేరా మరణాన్ని ఆయన కార్యాలయం ధృవీకరించింది. నలుగురు వ్యక్తులతో కలిసి హెలికాప్టర్‌లో పినేరా ప్రయాణిస్తుండగా.. అది ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో పినేరా మృతిచెందగా.. మిగతా వారు గాయాలతో బయటపడ్డారు. పినేరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చిలీ ఆర్మీ ప్రకటించింది.…