ఓ మహిళ బైక్ పై ఎలివేటెడ్ రోడ్డుపై వెళ్తుండగా కారు వచ్చి ఢీకొట్టింది. దీంతో.. యువతి ఎలివేటెడ్ రోడ్డుపై నుంచి కిందపడి ఎలివేటెడ్ రోడ్డు పిల్లర్‌పై ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆమెను రక్షించేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. చివరకు సురక్షితంగా కిందకు దించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో చాలా మంది వ్యక్తులు పిల్లర్ పై చిక్కుక్కున్న యువతిని రక్షించడానికి ప్రయత్నించినట్లు ఉంది.