పాఠశాలలో బాలికతో మాట్లాడినందుకు పాఠశాల విద్యార్థిపై దాడి చేసిన ఘటన కర్ణాటకలోని హుబ్బళ్లిలో సోమవారం చోటుచేసుకుంది. హుబ్బళ్లి-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ మాట్లాడుతూ.. ఐదు నుంచి ఆరుగురు సభ్యుల ముఠా ఓ పాఠశాల విద్యార్థిపై దాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని తెలిపారు.