కరోనా మహమ్మారి ఇంకా మనల్ని వీడలేదు. కరోనా కంటే వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ విస్తరించినట్టు సమాచారం. రాజస్థాన్లో 21, దిల్లీలో 12, కేరళలో 8 ఒమిక్రాన్ కేసులు కొత్తగా బయటపడడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. తమిళనాడులో ఒమిక్రాన్ ఒక్కసారిగా విజృంభించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించడంతో అంతా అలర్ట్ అయ్యారు. మహారాష్ట్రలోని…