నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న అయిదుగురు వ్యక్తులను తణుకు అరెస్టు చేశారు. తణుకు ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద సీడీఎం మెషీన్‌లో జమ చేయడంతో గుట్టు రట్టయ్యింది. ఈ ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయాల్సి ఉంది. పాలకొల్లు మండలం ఉల్లంపర్రు గ్రామానికి చెందిన అడబాల ఆంజనేయమూర్తి, పోడూరు మండలం జిన్నూరు గ్రామానికి చెందిన జుత్తిగ నాగరాజు, యలమంచిలి మండలం కాజ గ్రామానికి చెందిన దిగుమర్తి ఏసు, బీమవరం మండలం యల్లమెల్లిపురం గ్రామానికి చెందిన తోట…