హైదరాబాద్ నగరంలోని రామంతపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఘరానా మోసం బయటపడింది. బ్యాంక్ మేనేజర్లు భారీ మోసానికి పాల్పడ్డారు. లక్ష కాదు రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.2.80 కోట్లు కాజేశారు. ఖాతాదారులకు తెలియకుండా.. వారి డాక్యుమెంట్లు తీసుకుని మేనేజర్లు ఘరానా మోసం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న బ్యాంక్ మేనేజర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో షేక్ సైదులు, గంగ మల్లయ్యలు రామంతపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో బ్యాంక్ మేనేజర్లుగా పని చేశారు.…