Israel: ఇజ్రాయిల్‌పై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు పలువురు ఇజ్రాయిల్ పౌరులను, ఇతర దేశస్తులను బందీలుగా చేసుకున్నారు. ఇదిలా ఉంటే వీరిని రక్షించేందుకు ఇజ్రాయిల్ సిద్ధమవుతున్నట్లు బ్రిటీష్ పత్రికి ది టెలిగ్రాఫ్ నివేదించింది. దాదాపుగా 100 మంది పౌరులు హమాస్ ఉగ్రవాదులు చెరలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ నిర్వహించేందుకు ప్రపంచంలో అతిశక్తివంతమైన, ఇజ్రాయిల్ ప్రత్యేక ఆపరేషన్స్ దళం సయెరెట్ మత్కల్ సిద్ధమైనట్లు సమాచారం.