హిందీ చిత్రసీమలో మేటి నటులుగా పేరొందిన దిలీప్ కుమార్, రాజ్ కుమార్ కలసి నటించిన ‘సౌదాగర్’ చిత్రం విశేషాదరణ చూరగొంది. ఈ చిత్రానికి 32 ఏళ్ళ ముందు ‘పైఘామ్’లో వీరద్దరూ కలసి నటించారు. అందులో దిలీప్ కుమార్ కు అన్నగా రాజ్ కుమార్ కనిపించారు. నిజానికి వయసులో రాజ్ కంటే దిలీప్ నాలుగేళ్ళు పెద్దవారు. ‘పైఘామ్’ తరువాత వారిద్దరూ కలసి నటించకపోవడానికి పలువురు పలు రకాలుగా చెబుతారు. ఇద్దరూ ‘మెథడ్ యాక్టింగ్’లో నిష్ణాతులే అని పేరు సంపాదించారు.…