Koti Deepotsavam 2025: భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా ఏటా కార్తీకమాసంలో ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీల ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. శనివారం ప్రారంభమైన ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగిస్తున్నారు. కోటి దీపోత్సవం వేడుక కైలాసాన్ని తలపిస్తోంది. 2012లో లక్ష దీపోత్సవంగా మొదలై, 2013లో కోటి దీపోత్సవంగా మారి భక్తుల మదిలో అఖండ జ్యోతిగా వెలుగొందుతున్న ఈ…
కార్తికమాసం అనగానే తెలుగు రాష్ట్రాల్లో గుర్తుండిపోయే కార్యక్రమం భక్తి టీవీ కోటి దీపోత్సవం. ప్రతి ఏటా కార్తికమాసాన క్రమం తప్పకుండా కోటిదీపోత్సవ వేడుక కనుల పండువగా సాగుతోంది. పరమ పవిత్రమైన కార్తీక మాసాన.. వేలాది మంది భక్తులు ఒక్క చోట చేరి, లక్షలాది దీపాలను వెలిగించే అద్భుత, అద్వితీయ, ఆధ్యాత్మిక ఘట్టం కోటి దీపోత్సవం. పీఠాధిపతులు, గురువులు, ఆధ్యాత్మిక వేత్తల సమక్షంలో లక్షల మంది ఒక్క చోట ఇలా దీపాలు వెలిగించడం ఓ మహాద్భుతమైన సంరంభం. ఈనెల…