గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అయ్యిందని.. గ్రామీణ స్థాయి నుంచి సీఎం కప్ ను ఏర్పాటు చేస్తున్నట్లు సాట్ ఛైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో రేపు సాయంత్రం4గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా క్రీడా జ్యోతిని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.
Today Business Headlines 17-03-23: టీసీఎస్ సీఈఓ రాజీనామా: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ రాజేశ్ గోపీనాథన్.. పదవి నుంచి తప్పుకున్నారు. ఈ నిర్ణయం 6 నెలల తర్వాత.. అంటే.. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో కృతి వాసన్‌ని భవిష్యత్ సీఈఓగా నియమించారు. ఈయన ప్రస్తుతం ఇదే సంస్థలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ డిపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్‌గా, గ్లోబల్ హెడ్‌గా ఉన్నారు.
Today (03-02-23) Business Headlines: హైదరాబాద్ కంపెనీ ‘ఆజాద్’ ఘనత: హైదరాబాద్ సంస్థ ఆజాద్ ఇంజనీరింగ్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ మార్కెట్’కి న్యూక్లియర్ విడి భాగాలను అందించిన దేశంలోనే తొలి కంపెనీగా నిలిచింది. ఫ్రాన్స్’లో తయారుచేస్తున్న న్యూక్లియర్ టర్బైన్లకు కీలకమైన స్పేర్ పార్ట్స్ సప్లై చేసినట్లు ఆజాద్ ఇంజనీరింగ్ సంస్థ వెల్లడించింది. ఫ్రాన్స్ కంపెనీ GE స్టీమ్ పవర్’తో ఉన్న దీర్ఘకాలిక ఒప్పందం వల్లే వరల్డ్ వైడ్’గా న్యూక్లియర్ సెక్టార్’లో బిజినెస్ ఆపర్చునిటీస్’ని దక్కించుకున్నామని తెలిపింది.