సుధీర్ బాబు హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. సుధీర్ ను పూర్తి స్థాయిలో మాస్ హీరోగా ప్రొజెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్. 70 ఎమ్.ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు విజయ్ చిల్లా. శశిదేవరెడ్డి. ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వస్తున్న ఈ చిత్రానికి యు.ఎ సర్టిఫికెట్ లభించిందని, తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందని నిర్మాతలు అంటున్నారు. ఆగస్ట్ 27న విడుదల అవుతున్న సందర్బంగా…