కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను, 15వ ఆర్థిక సంఘం నిధులను గత కొద్ది నెలలుగా నిలిపివేసిందని, దీనివల్ల స్థానిక సంస్థల అభివృద్ధి కుంటుపడుతున్నదని సర్పంచుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును నాయకులు కలిసిశారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ వివక్ష తగదని , కేంద్ర నిధులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆ నిధులు వచ్చేలా కేంద్రంపై వత్తిడి తేవాలని విజ్ఞప్తిచేశామన్నారు.…