హైదరాబాద్ సారథి స్టూడియోస్‌లో కలకలం రేగింది. ప్రస్తుతం సినీ పరిశ్రమలో వేతనాల పెంపు కారణంగా షూటింగ్‌లు జరగడం లేదు. 30% వేతనాలు పెంచి ఇచ్చిన వారికి మాత్రమే షూటింగ్‌లకు వెళ్లాలని ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయించింది. అలా కొంత మంది వేతనాలు పెంచి షూటింగ్ చేయించుకుంటున్నారు. అయితే, తాజాగా హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో సినీ కాస్ట్యూమర్స్ అసోసియేషన్ సెక్రటరీ, అలాగే ఆ యూనియన్‌లో ఉన్న ఒక సభ్యుడి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. కాస్ట్యూమర్స్ అసోసియేషన్ సెక్రటరీ నరసింహ,…