Jharkhand: ఏడాది మార్చి వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ కగార్ పేరుతో అడవుల్లో నక్సలైట్లను తుదముట్టిస్తున్నారు. కొంద మంది లొంగిపోగా.. మరి కొందరు మాత్రం తుపాకులకు బలవుతున్నారు. తాజాగా భద్రతా దళాలు నిర్వహించిన భారీ సంయుక్త యాంటీ–నక్సల్ ఆపరేషన్‌లో సీపీఐ (మావోయిస్టు) సెంట్రల్ కమిటీ సభ్యుడు, అత్యంత వాంటెడ్ నక్సలైట్ పటీరామ్ మాఝీ అలియాస్ ‘అనల్ దా’ హతమయ్యాడు. ఝార్ఖండ్‌లోని సారండా అటవీ…