Rocking Rakesh as hero: జబర్దస్త్ కమెడియన్లు అనేక మంది సినిమాల్లో కామెడియన్లుగా మాత్రమే కాదు కొందరు హీరోలుగా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. షకలక శంకర్, సుడిగాలి సుధీర్ వంటి వారు ఇప్పటికే హీరోలుగా పలు సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు రాకింగ్ రాకేష్ కూడా హీరోగా మాయాడు. గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై గరుడవేగ మేకింగ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది.…
Santosh Kumar: ఆసియాలోనే రెండో అతిపెద్ద మర్రిచెట్టు తెలంగాణలోనే ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రిలో ఈ వృక్షం నెలకొని ఉంది. 800 ఏళ్ల నాటి ఈ పురాతన వృక్షాన్ని సంరక్షించేందుకు టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ నడుం బిగించారు. ఇప్పటికే ఆయన పర్యావరణ పరిరక్షణకు ఎంతో పాటుపడుతున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో సెలబ్రిటీల చేత మొక్కలు నాటిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఎన్నో లక్షల మొక్కలను నాటారు. తాజాగా మహబూబ్‌నగర్…
Save Desi Cows: క్రాస్ బ్రీడింగ్ వల్ల దేశంలో అంతరించిపోయే దశకు చేరిన దేశవాళీ ఆవుల సంరక్షణకు తాము చేస్తున్న ప్రయత్నాలకు మద్దతునివ్వాలని సేవ్ దేశీ కౌస్ క్యాంపెనర్ అల్లోల దివ్యారెడ్డి.. ఎంపీ సంతోష్ కుమార్‌ను కోరారు. మంగళవారం ప్రగతి భవన్‌లో ఎంపీ సంతోష్ కుమార్‌ను కలిసి దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలను ఆమె వివరించారు. హైబ్రిడ్ జాతులతో క్రాస్ బ్రీడింగ్ పద్ధతుల వల్ల దేశీయ పశుసంపద కనుమరుగైపోకుండా, వాటిని పరిరక్షించి, భవిష్యత్ తరాలకు…
టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ కార్యక్రమంలో తాజాగా ప్రముఖ గాయని సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్కులో సింగర్ సునీత మొక్కలు నాటారు. అనంతరం సునీత మాట్లాడుతూ.. సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రకృతి కన్నతల్లి లాంటిది అని.. కన్నతల్లిని ఎలా ప్రేమగా చూసుకుంటామో.. అదేవిధంగా…
“మనం బ్రతుకుదాం – పది తరాలకు బతికే అవకాశం కల్పిద్దాం” అన్నారు రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రథసారథి జోగినిపల్లి సంతోష్ కుమార్. ప్రపంచ ధరిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటిన ఆయన “ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాలు పెరగడం, ప్రమాదకరస్థాయికి ప్లాస్టిక్ వినియోగం పెరగడం, నేలంతా విషతూల్యం కావడం, భూవాతావరణం గతంలో ఎప్పుడూలేనంతగా వేడెక్కడం” పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపరిణామాల వల్ల మిలియన్ల ప్రజల బ్రతుకులు విచ్ఛిన్నమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ…
దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఎలా పెరిగిపోతుందో మనందరం చూస్తున్నాం. అలాంటి పరిస్థితి మన హైదరాబాద్ నగరానికి రాకూడదంటే మనందరం బాధ్యతగా ఎవరికి వారు మొక్కలు నాటి వాటిని సంరక్షించే చర్యలు చేపట్టాల్సిందిగా ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. రహ్మత్ నగర్ డివిజన్‌లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి సంతోష్ కుమార్ మొక్క నాటారు.…
తెలంగాణ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ దేశంలో పచ్చదం పెంచడం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో సీనీ, రాజకీయ, వ్యాపారవేత్త ప్రముఖులు పాల్గోని మొక్కలు నాటారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రధాని మోడీ సంతోష్ కుమార్‌ను ప్రశంసించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ సంతోష్ కుమార్ కు ప్రధాని మోడి లేఖ రాశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విశిష్టతపై వృక్షవేదం…