టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. తాజాగా సంక్రాంతి పండుగా కానుకగా విడుదలైన ఈ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఈ సినిమాను ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. వెంకటేష్ కామెడీ స్టైల్, మేనరిజం మరోసారి తెరపై చూపించారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీ యాక్టింగ్ కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. మొత్తానికి…