ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందాల్సిన ‘స్పిరిట్’ సినిమా గురించి చాలా అంచనాలు ఉన్నాయి. నిజానికి, ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని ప్రభాస్ అభిమానులతో పాటు సినీ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఇటీవల ‘కింగ్డమ్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా, ఈ సినిమాను సెప్టెంబర్‌లో సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశం ఉందని తెలిపారు. కానీ, తాజా సమాచారం మేరకు అది…