హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లిబర్టీ చౌరస్తాలో ఓ త్రాచు పాము కలకలం సృష్టించింది. మొదటగా లిబర్టీ చౌరస్తా సిగ్నల్ వద్ద ఉన్న వేప చెట్టుపై పాము కనిపించింది. ఇక చెట్టు నుండి కేబుల్ వైర్ల సహాయంతో సిగ్నేల్ పౌల్ వద్దకు పాము చేరుకుంది. సాయంత్రం సమయంలో పాము ప్రత్యేక్షం కావడంతో వాహనదారులు ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేసి, తమ ఫోన్ లలో పాము వీడియోను తీసుకున్నారు. దీనితో లిబర్టీ చౌరస్తా లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.…