భారత జట్టులో సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల స్థానాన్ని ఎన్నడూ ప్రశ్నించకూడదని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నారు. రో-కోలకు ఆట కొత్త కాదని, కొన్ని ఓవర్లు ఆడితే లయ అందుకుంటారన్నారు. ఇద్దరిని ఇతర ఆటగాళ్ల కంటే భిన్నంగా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రోహిత్-కోహ్లీలు ఒకే ఫార్మాట్ ఆడుతున్నా.. ఫామ్ విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండదని బంగర్ చెప్పుకొచ్చారు. టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన రో-కోలు ప్రస్తుతం వన్డేలు మాత్రమే…