సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నారాయణఖేడ్- బీదర్ NH 161B పై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. నారాయణఖేడ్ శివారులో నూతనంగా నిర్మిస్తున్న హైవే పక్కన కల్వర్టు గుంతలో అదుపుతప్పి బైక్ బోల్తా కొట్టింది. బైకు మీద నుంచి కిందపడిపోయిన యువకులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.…