‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య, సంజన సారధి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘సరసాలు చాలు’. ఈ సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తనయుడు సాయికిరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యూనిట్ సభ్యులకు సాయికిరణ్ స్క్రిప్ట్ అందించగా, శ్రీమతి శ్రుతిరెడ్డి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. చంద్రాకాంత్ రెడ్డి, రోహిత్ కెమెరా స్విచ్చాన్…