రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ‘సరసాలు చాలు’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య, సంజన సారధి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘సరసాలు చాలు’. ఈ సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తనయుడు సాయికిరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యూనిట్ సభ్యులకు సాయికిరణ్ స్క్రిప్ట్ అందించగా, శ్రీమతి శ్రుతిరెడ్డి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. చంద్రాకాంత్ రెడ్డి, రోహిత్ కెమెరా స్విచ్చాన్ చేశారు.
‘లూజర్’ వెబ్ సీరిస్ డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం దర్శకుడు డాక్టర్ సందీప్ చేగూరి మాట్లాడుతూ, ” ‘ఒక చిన్న విరామం’ సినిమా తర్వాత దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమా ఇది. మూవీ పేరుకు తగ్గట్టుగానే రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా దీనిని తీయబోతున్నాను. అన్ని వర్గాలకు నచ్చే క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ మూవీ ఇది. ప్రతి కపుల్ కి, రిలేషన్ షిప్ లో ఉన్న వాళ్ళకి, పెళ్లైన వాళ్ళ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ తో సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఎమోషన్స్, హార్ట్ బ్రేక్స్, నవ్వులు, కోపాలు ఉంటాయి. ఈ చిత్రంలో అద్భుతమైన నాలుగు పాటలు ఉంటాయి. మూడు షెడ్యూల్లో ఈ సినిమాను పూర్తి చేసి సమ్మర్ లో విడుదల చేస్తాం” అని అన్నారు.
Also Read
- Dil Raju: 'సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..': ప్రొడ్యూసర్ దిల్ రాజు
- Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్‌కు పూనకాలే..
- Trisha: 'తోడు దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటా..' పెళ్లిపై త్రిష బోల్డ్ స్టేట్మెంట్!
- Prithviraj Sukumaran: మోహన్‌లాల్‌ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
తాజావార్తలు
-
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
-
Europe Heatwave: యూరప్‌ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
-
Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..