హైదరాబాద్ శంషాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో రామానుజాచార్యుల విగ్రహాన్ని సందర్శించిన రాందేవ్ బాబా.. చినజీయర్ స్వామిపై ప్రశంసలు కురిపించారు. రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటు చేసిన చినజీయర్‌స్వామి చరిత్రలో నిలిచిపోతారని యోగా గురు రాందేవ్ బాబా అన్నారు. భారత వాస్తు, సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనుకునేవారు కచ్చితంగా రామానుజాచార్యుల దివ్యక్షేత్రాన్ని సందర్శించాలని సూచించారు. తాను వీలైనన్నిసార్లు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటానని రాందేవ్ బాబా చెప్పారు. అటు భారతీయ సంస్కృతిలో అసమానత, అన్యాయం ఉందని కొందరు పదేపదే వాదిస్తుంటారని.. సనాతన ధర్మంపై…