పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ గడించిన కథానాయికల్లో సమంత ఒకరు. అయితే, ఆమె ఈ స్థాయికి అంత ఈజీగా చేరుకోలేదు. ఎన్నో కష్టాలు, సవాళ్ళను ఎదుర్కొని.. ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది. వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. జెస్సీ (ఏం మాయ చేశావే)గా యువత మనసు దోచిన ఈ భామ.. ఆ తర్వాత నటన పరంగా ఎన్నో విమర్శల్ని ఎదుర్కొంది. అందంతో నెట్టుకొస్తోందే తప్ప, యాక్టింగ్ రాదంటూ ఎందరో పెదవి విరిచారు. అలాంటి వాళ్ళందరి…