సమంత స్వల్ప అనారోగ్యానికి గురైంది అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నిన్న కడప పర్యటన తర్వాత సమంత అస్వస్థతకు గురై ఆసుపత్రికి వెళ్లారని సర్వత్రా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కడపలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన ఆమె, అమీన్ పీర్ దర్గాతో పాటు తిరుమల పుణ్యక్షేత్రాన్ని కూడా సందర్శించారు. అప్పటి నుంచి ఆమెకు ఆరోగ్యం బాగోలేదని, ఆరోగ్య సమస్యలు తలెత్తాయని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ఆమె మేనేజర్ క్లారిటీ ఇచ్చారు.…