Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి చెందిన ఫామ్ హౌజ్ లోకి ఇద్దరు అపరిచిత వ్యక్తులు ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పోలీసుల వీరిద్దరిని అరెస్ట్ చేశారు. ముంబై సమీపంలోని పన్వేల్‌లోని సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌజ్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. జనవరి 4న ఈ ఘటన జరిగింది. నిందితులను అజేష్ కుమార్ ఓంప్రకాష్ గిల్, గురుసేవక్ సింగ్ తేజ్‌సింగ్ సిఖ్‌లు గుర్తించారు.