కండల వీరుడు సల్మాన్ ఖాన్ చెప్పిన టైంకి రాడు అన్న టాపిక్ ఆపినా ఆగేటట్లు లేదు. ఏఆర్ మురుగుదాస్ మొదలు పెట్టిన ఈ చిచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది. సికిందర్ డిజాస్టర్ కావడానికి సల్మానే కారణమని, సెట్‌కి ఆలస్యంగా వచ్చేవాడని, మార్నింగ్ తీయాల్సిన సన్నివేశాలు రాత్రి తీయాల్సి వచ్చేదని, దీని వల్ల ఎమోషనల్ సీన్స్ దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చాడు. దీనిపై రీసెంట్లీ కౌంటరిచ్చాడు సల్మాన్ ఖాన్. మదరాసి హీరో ఉదయం ఆరుగంటలకే వచ్చేసేవాడు అదేమైనా బ్రహ్మాండంగా ఆడిందా అంటూ…
సల్మాన్ ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు అతడితో వర్క్ చేసిన డైరెక్టర్స్ మురుగుదాస్ అండ్ అభినవ్ కశ్యప్. సికిందర్ డిజాస్టర్ కావడానికి సల్మాన్ ఖానే కారణమంటూ సౌత్ డైరెక్టర్ మురుగుదాస్ కామెంట్స్ చేశాడు. ‘రాత్రి 8 గంటలకు షూట్‌కు వస్తాడు. షూటింగ్ స్టార్టయ్యే టైంకి 11 అవుతుంది. అర్థరాత్రి 2-3 గంటల వరకు షూట్ చేయాల్సి వచ్చేది. దీని వల్ల కొన్ని ఎమోషనల్ సీన్స్ సరిగ్గా పండలేదు” అంటూ తప్పంతా సల్లూబాయ్‌దే అన్నట్లుగా మురుగుదాస్ సల్మాన్ పై…