Saina Nehwal Retirement: భారతదేశపు దిగ్గజ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, అత్యంత గుర్తింపు పొందిన వ్యక్తులలో ఒకరైన సైనా నెహ్వాల్ తన రిటైర్మెంట్ ప్రకటించారు. చాలా కాలంగా తీవ్రమైన మోకాలి సమస్యతో బాధపడుతున్నా సైనా.. ఇంకా కోలుకోలేకపోతోంది. చివరికి ఆమె ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె మాట్లాడుతూ.. తన మోకాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. దీనివల్ల ఉన్నత స్థాయి శిక్షణ అసాధ్యమని సైనా పేర్కొంది.