Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం అనే అక్రమ బంగ్లాదేశీ వ్యక్తి అతడిపై దాడికి పాల్పడ్డాడు. కత్తితో సైఫ్‌పై దాడి చేయడంతో, 6 చోట్ల గాయాలయ్యాయి.