రాజస్థాన్‌లో పాఠశాల విద్యార్థులకు ఉచితంగా అందించే సైకిళ్ల రంగును మార్చిన భజన్‌లాల్ ప్రభుత్వం కళాశాలలకు కాషాయ రంగు వేయడానికి సిద్ధమవుతోంది. మొదటి దశలో రాష్ట్రంలోని ప్రతి డివిజన్‌లోని రెండు కళాశాలల ముఖద్వారాలు, హాళ్లకు కాషాయం రంగులు వేయని నిర్ణయించింది. దీని తర్వాత రెండో దశలో రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల రంగు మారనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మొదటి దశలో 10 డివిజన్లలోని 20 కళాశాలల్లో పనులు ప్రారంభమయ్యాయి.