జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ మలిక్ తొలి రోజు కస్టడీలో కీలకవిషయాలు బయటపెట్టాడు. చంచల్‌గూడ జైలులో ఉన్న అతణ్ని పోలీసులు గురువారం (జూన్ 9) మధ్యాహ్నం జూబ్లీహిల్స్ పీఎస్ కు తీసుకెళ్లారు. వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ ఇక్బాల్ సిద్దిఖీ, బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ సుదర్శన్ సాదుద్దీన్ మలిక్‌ను సుమారు 6 గంటలకుపైగా విచారణ చేసారు. సాదుద్దీన్ మాలిక్ కస్టడీ విచారణలో వెల్లడించిన స్టేట్మెంట్ నేడు కీలకంగా మారనుంది. మే 28న…