కరోనా బాధితులను ఆదుకునేందుకు సాధన దీక్ష చేయడం ఒక చరిత్ర అని… సీఎం జగన్ బాధ్యతా రాహిత్యంతో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అన్నారు. కరోనా బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు టీడీపీ చేపట్టిన సాధన దీక్ష ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రికి ప్రతిపక్షాలు, ప్రజలు, పత్రికలు చెప్పినా పాటించడం ఆనవాయితీగా వస్తోందని… ఒకప్పుడు పేపర్లలో…
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా కారణంగా వేలాది మంది ఇప్పటికే మృతి చెందారు. లక్షలాది మంది కరోనా బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోవిడ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాంట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ టీడీపీ సాధన దీక్షలకు పిలుపునిచ్చింది. ఈరోజు రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో టీడీపీ నేతలు సాధన దీక్షలు చేయబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌లో నిరసన దీక్ష చేస్తున్నారు. ఉదయం 11 గంటల…