తెలంగాణలో అందరికి ఇష్టమైన పండుగ ‘బతుకమ్మ’ అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. బతుకమ్మ పాటల్లో తెలంగాణ భాష తియ్యదనం ఉంటుందని.. బతుకమ్మలో పేర్చేవి తోట పువ్వులు కాదు, బాట పువ్వులు అని చెప్పారు. పూలనే దేవతలుగా పూజించే పండుగ బతుకమ్మ అని.. బతుకమ్మకు గుడి లేదు, మంత్రాలు లేవు, పూజారి ఉండడు అని ఎమ్మెల్సీ దేశపతి చెప్పుకొచ్చారు. తెలంగాణ భవన్‌లో ఈరోజు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళా నాయకులు బతుకమ్మ పాటలను విడుదల చేశారు. ఈ…