Sacrifice Incident: గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో దారుణం జరిగింది. భార్య, భర్తలు తమ తలలను నరుక్కుని, తమను తాము బలి ఇచ్చుకున్నారు. ఇంట్లోనే గిలెటిన్ లాంటి పరికరాన్ని అమర్చుకుని తలలు తెగిపడేలా చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డరని పోలీసులు ఆదివారం వెల్లడించారు. మృతులు హేముభాయ్ మక్వానా (38), అతని భార్య హన్సాబెన్ (35) వింఛియా గ్రామంలోని తమ పొలంలో ఉన్న గుడిసెలో ఈ దారుణానికి ఒడిగట్టారు.