తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందని చేవెళ్లలో సభ నిర్వహిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీజేపీ నాయకులను ప్రశ్నించారు. శనివారం చేవెళ్ల నియోజకవర్గం కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.