Sabari Express: గుంటూరు రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై అడ్డంగా ఓ ఇనుప రాడ్డును ఉంచిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. కంకరగుంట గేటు సమీపంలో రైల్వే ట్రాక్‌పై అడ్డంగా కొందరు దుండగులు ఇనుప రాడ్డును బిగించారు. దీంతో సోమవారం సాయంత్రం సికింద్రాబాద్-త్రివేండ్రం శబరి ఎక్స్‌ప్రెస్ వెళ్లే సమయంలో స్థానికులు ఈ ఇనుప రాడ్డును గుర్తించారు. సాయంత్రం 5 గంటల సమయంలో నల్లపాడు-గుంటూరు సెక్షన్ మధ్య రైలు పట్టాలపై ఉంచిన ఇనుపరాడ్డును చూసిన లోకో పైలెట్ మంజునాథ్…