ఈ యేడాది లాస్ట్ వీకెండ్ లో ఏకంగా పది సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ఎనిమిది స్ట్రయిట్ సినిమాలు కాగా రెండు అనువాద చిత్రాలు. ఇందులో అనుపమా పరమేశ్వరన్ నటించిన 'బట్టర్ ఫ్లై' మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
నందమూరి తారకరత్న హీరోగా నటించిన సినిమా 'ఎస్ -5'. నో ఎగ్జిట్ అనేది ట్యాగ్ లైన్. ఈ నెలాఖరులో జనం ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది.