రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ప్రారంభమై మూడు నెలలు గడిచాయి. ఇప్పటికే ఈ రెండు దేశాలు తగ్గడం లేదు. రష్యా దాడిలో ఉక్రెయిన్ పట్టణాలు, నగరాలు, గ్రామాలు ధ్వంసం అవుతున్నాయి. అయినా ఇప్పట్లో యుద్ధానికి ఫుల్ స్టాప్ పడటం లేదు. ఉక్రెయిన్ లో 20 శాతం ప్రస్తుతం రష్యా ఆధీనంలోకి వెళ్లిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. ప్రస్తుతం ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలైన డాన్ బాస్, లుహాన్స్క్ ప్రాంతాలపై రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. యుద్ధం…
ఉక్రెయిన్-రష్యా వార్ ఉధృతంగా సాగుతోంది.. మరోవైపు శాంతి చర్చలకు కూడా సిద్ధం అవుతున్నారు.. మొదటి విడత చర్చలు విఫలం కావడంతో.. బెలారస్‌లో రెండవ విడత శాంతి చర్చల కోసం ప్రతినిధులను పంపామని చెబుతోంది రష్యా.. అయితే, రష్యా చర్చలు జరపాలనుకుంటే వెంటనే దాడులు ఆపాలని డిమాండ్ చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. దీంతో, చర్చలు ఉంటాయా? లేదా? అనేది ప్రశ్నగా మారింది.. మరోవైపు, రష్యా దాడులు మొదలైన తర్వాత 9 లక్షల మందికి పైగా ప్రజలు…
ఉక్రెయిన్-రష్యా మధ్య చర్చలు విఫలం అయిన తర్వాత యుద్ధం మరింత భీకరంగా సాగుతోంది.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సిటీపై ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశం ఉంది.. దీంతో ఉక్రెయిన్‌లోని తమ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేసింది భారత ప్రభుత్వం.. ముఖ్యంగా కీవ్ సిటీని వెంటనే ఖాళీ చేయాలని.. కీవ్‌ను భారతీయులు తక్షణమే వదిలి పెట్టాలని కేంద్రం ఆదేశించింది.. కీవ్ సిటీ నుంచి ఎలాగైనా బయటపడండి అని ఆదేశాలు జారీ చేసింది. Read Also: Zain Nadella:…
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను క్రమంగా ఒంటరిని చేసే ప్రయత్నం జరుగుతోంది.. ఇప్పటికే చాలా దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి.. ఇక, వచ్చే వారం ఐక్యరాజ్య సమితి సాధారాణ సభలో ఓటింగ్ ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా ఓటింగ్ జరగబోతోంది.. రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రతిపాదించిన తీర్మానంపై ఓటింగ్ ఉండనుంది.. అయితే, రెండోసారి కూడా తటస్థ వైఖరినే అవలంభిస్తోంది భారత్.. ఇక, ఐక్యరాజ్య సమితిలోని 12 మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించింది…
ఉక్రెయిన్‌లో ఆరో రోజు రష్యా దాడులు కొనసాగుతున్నాయి. నిన్న ఎలాంటి ఒప్పందం లేకుండానే రష్యా-ఉక్రెయిన్ తొలివిడత చర్చలు అసంపూర్తిగా ముగియడంతో రష్యా దాడులను మరింత ఉధృతం చేసింది. మరో రెండు కీలక నగరాలను స్వాధీనం చేసుకునేందుకు పుతిన్ సేనలు ప్రయత్నిస్తున్నాయి. కీవ్ నగానికి 40 మైళ్ల దూరంలో రష్యా మిలెట్రీ కాన్వాయ్ ఉంది. దీనిపై శాటిలైట్ ఫోటోలు విడుదలయ్యాయి.. పుతిన్ సేనలు ఏమాత్రం.. వెనక్కి తగ్గడం లేదు. బాంబుల వర్షం కురిపిస్తోంది. దాడుల్లో పెద్ద ఎత్తున ప్రాణ…