Trump tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్‌తో ప్రపంచదేశాలు విసిగిపోయాయి. ప్రపంచంలోనే పలు ప్రధాన దేశాలపై ఆయన సుంకాలు విధించారు. అన్ని దేశాల కన్నా ఎక్కువగా భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారు. దీనికి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ, ఉక్రెయిన్ యుద్ధానికి సహకరిస్తున్నారనే సాకు చెబుతున్నారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టానురీతిలో పలు దేశాలపై సుంకాలు విధించడాన్ని ఇటీవల అమెరకన్ ఫెడరల్ అప్పీల్ కోర్టు తప్పు పట్టింది. అయితే, ఈ తీర్పును ట్రంప్ సర్కార్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబోతోంది. కోర్టులో పిటిషన్ వేసిన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ఈ సుంకాలను ఉక్రెయిన్ యుద్ధంలో భారత్‌ని లింక్ చేసింది. ‘‘ఉక్రెయిన్‌లో శాంతి కోసం మా ప్రయత్నంలో కీలకమైన అంశం’’ అని సుంకాలను సమర్థిస్తూ వాదించింది.
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మూడేళ్లు పూర్తి చేసుకుంది. రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పుడు.. అమెరికాతో సహా పాశ్చాత్య దేశాలు రష్యాపై అనేక ఆంక్షలు విధించి దాని ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయి.