Putin Flight: ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు(డిసెంబర్ 4)న భారత పర్యటనకు వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రోటోకాల్ పట్టించుకోకుండా, నేరుగా పాలం ఎయిర్ బేస్‌కు వెళ్లి పుతిన్‌ను ఘనంగా స్వాగతించారు. అక్కడ నుంచి ఇద్దరూ కూడా ప్రధాని నివాసానికి వెళ్లారు.
Putin to Visit India: అమెరికాతో ఉద్రిక్తత మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి వస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది చివర్లో భారత్‌ను సందర్శిస్తారని, ప్రస్తుతం తేదీలు ఖరారు అవుతున్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం మాస్కో పర్యటన సందర్భంగా తెలిపారు. ఈ పర్యటనపై భారత్ ఎంతో ఉత్సాహం, ఆనందంగా ఉందని అజిత్ పేర్కొన్నారు. గత భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశాలను ద్వైపాక్షిక సంబంధాలలో మార్పు క్షణాలుగా ఆయన అభివర్ణించారు.