Suicide Attempt: అప్పు ఇవ్వడం వరకే.. అప్పు ఇచ్చిన వారి చేతుల్లో ఉంటుంది. తిరిగి రాబట్టుకోవడం అంటే ఓ పెద్ద సవాల్‌గానే మారుతోంది. అప్పు ఇచ్చిన వారు.. తీసుకున్న వారికే భయపడే రోజులు కనిపిస్తున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంట్లో.. అప్పు తీసుకున్న వాడి కారణంగా ఇద్దరు బలయ్యారు. అసలు ఆ అప్పు కథేంటి? అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంట్లో విషాదం ఎలా జరిగింది? చూద్దాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతని పేరు…
Nandyal District: ఆస్తికోసం మనుషులు రక్కసులుగా మారుతున్నారు. ఆస్తి వస్తుందంటే.. కన్న తల్లి ప్రాణాన్ని తీసేంత కసాయిలుగా మారిపోతున్నారు. తాజాగా నంద్యాల జిల్లా బనగానపల్లె (మం) రాళ్ల కొత్తూరులో ఇలాంటి ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తండ్రి కర్మ కాండలు పూర్తి కాక ముందే ఆస్తి కోసం కన్న తల్లిని చంపేందుకు కొడుకు, మనవళ్ల యత్నించారు.
మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. భూమి తగాదా విషయంలో అన్నను తమ్ముళ్లు కత్తితో పొడిచి చంపారు. వల్లపు లింగయ్య అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు.
భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం వంజిరిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన డోకే జయరామ్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ఒక అమ్మాయి పుట్టింది. ఆమెకు ఇక పిల్లకు పుట్టక పోవడంతో మగపిల్లాడి కోసం రెండో వివాహం చేసుకున్నాడు జయరామ్.